Thursday, January 23, 2025

ఒక్క శాతం లేనివారికి నాలుగు మంత్రి పదవులా?: ఈటల

- Advertisement -
- Advertisement -

స్టేషన్‌ఘన్‌పూర్: పదేళ్లలోనే సిఎం కెసిఆర్ లక్షల కోట్లకు ఎలా యజమానయ్యారని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. జనగాం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తల పోలింగ్‌ బూత్‌ మేళాలో రాజేందర్‌ మాట్లాడారు.  అటుకులు బుక్కి… ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడిపామని ఈటల గుర్తు చేశారు. ఎన్నికల వేళ భారీగా ఖర్చు చేయడానికి సిఎం కెసిఆర్ సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు. మాదిగ జాతి 11 శాతం ఉన్నవారికి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ఒక్క శాతం లేనివారికి నాలుగు మంత్రి పదవులు ఎలా వచ్చాయని నిలదీశారు. 30 ఏళ్లుగా స్టేషన్ ఘన్‌పూర్‌కు కడియం శ్రీహరి చేసిందేమీ లేదని ఈటల మండిపడ్డారు.

Also Read: పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News