Monday, December 23, 2024

ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడు: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేను కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శించాను.. రేవంత్ రెడ్డిని కాదని బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ అన్నారు. రాహుల్ అనర్హతపై కాంగ్రెస్ కంటే ఎక్కువ బిఆర్ఎస్ స్పందించింది. కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయాలని చూసింది కెసిఆర్ కాదా?.. బిఆర్ఎస్ తో పొత్తుపై కోమటిరెడ్డి, జానారెడ్డి పరోక్షంగా చెప్పింది నిజం కాదా? అని ఈటల ప్రశ్నించారు. రేవంత్ పోరాడుతారనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకుంటారని అనుకోలేదన్నారు.

కన్నీళ్లు పెట్టుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడారు. ధీరుడు ఎప్పుడూ కన్నీల్లు పెట్టుకోడు అని ఆయన తెలిపారు. చంద్రబాబు పంచన చేరి తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి, ఎప్పుడూ ప్రజల కోసం జైలుకు వెళ్లలేదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోపై రేవంత్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి సహకరించట్లేదని ఈటల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News