ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బిజెపి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడుతూ మాజి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన తప్పులే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీ నాయకులను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కెసిఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది వృధా అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ఈటల జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మూడోసారి భారత ప్రధాని అవుతారని ఈటల వ్యాఖ్యానించారు.