మన తెలంగాణ/హైదరాబాద్: రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు రుణమాఫీ నిబంధనలే రైతుకు ఉరితాళ్లు అవుతున్నాయని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పంటల రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రుణమాఫీ కావాలంటే తెల్ల రేషన్‌కార్డు ఉండాలని నిబంధన పెట్టాన్నారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయలేదని, కొత్తగా దరఖాస్తులు తీసుకుని 7 నెలలయినా ఇవ్వలేదని చెప్పారు.
ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇ చ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షరతులు విధించి రాష్ట్ర రైతులను మోసగిస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు. వ్యక్తిగతంగా వివిధ కా రణాలతో అనేక మంది రైతులు తమ రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్నారని, ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకున్నారని వారందరికీ ఇప్పుడు రుణమాఫీ చేయబోమని షరతు విధించడం సరికాదన్నారు. రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు.. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల మెట్ట పొలం వారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఈ విషయం తెల్వ దా? రేవంత్ చదువుకున్నారా అని ప్రశ్నించారు.
కుటుంబాల్లో విభజన జరిగినా ఒకే రేషన్ కార్డు కారణంతో వారికి రుణమాఫీ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ లో పని చేసే వారికి, సింగరేణి కార్మికులకు రేషన్ కార్డులు లేవవి రేషన్ కార్డు నిబంధనల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రు ణమాఫీ కోసం ఎదురు చూస్తున్న 69 లక్షల మం ది రైతులకు నిరాశే మిగలబోతున్నదన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పెద్ద పెద్ద కంపెనీలే కట్టడం లేదని, ఇంటి రుణాలు, వాహన రుణాలు, పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు సామాన్య ప్రజలంతా ఐటీ చెల్లిస్తున్నారని వీరిలో సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అక్కడక్కడా రైతు లూ చెల్లిస్తున్నారన్నారు.
ఐటి చెల్లిస్తున్నారనే పేరుతో భూమిని నమ్ముకున్న నిజమైన రైతులకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. మా దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రుణమాఫీ చేస్తామని చెప్పారో ఆ దేవత పేరు మీద ప్రమాణం చేసి మోసం చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నీ మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానం అని, మీకు కావాల్సిందల్లా ఎమ్మెల్యేలు మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఫిరాయింపుల్లో కేసీఆర్ జుట్టులోనే పుట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఒక రకంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మరో రకంగా చేస్తున్నారని విమర్శించారు.