Thursday, January 16, 2025

పేదల ఉసురు మంచిది కాదు: ఈటెల రాజేందర్

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరిట క్రమబద్ధీకరణ చేసిన భూములనే బీఆర్‌ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు విక్రయించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇప్పుడు ఆ బీఆర్‌ఎస్ పార్టీ నేతలే మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇక డీపీఆర్ లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. నిన్ను ఎన్నుకుంటే పేదల బతుకు ఇట్లా ఆగం చేస్తావా? అని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవానికి ఇళ్లు కూల్చడం దేనికని ప్రశ్నించారు.

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరును తమ పార్టీ ఖండిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం చెరువులను అన్నింటినీ క్లీన్ చేస్తే అభినందిస్తామన్నారు. డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడాలన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అందులో విష రసాయనాలు కలుస్తున్నాయన్నారు. గత ముఖ్యమంత్రి హుస్సేన్ సాగర్‌ను ఎందుకు క్లీన్ చేయలేదని ప్రశ్నించారు. సచివాలయం బఫర్ జోన్‌లో కట్టలేదా? అని నిలదీశారు. పేదల ఉసురు మంచిది కాదన్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు జరిపితే బుల్డోజర్లకు అడ్డుపడతామన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం జరగనున్న మహాధర్నాకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News