- Advertisement -
హైదరాబాద్: కోటి కలలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను కెసిఆర్ సర్కార్ నిండా ముంచుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ సరిగ్గా చేయ్యక పోగా చేసిన కొన్నింటిలో అక్రమాలు యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయన్నారు.
కూలి పనిచేసి, కూరగాయలు అమ్మి ఎంతో మంది తల్లులు తమ పిల్లలకుపై చదువులు చెప్పించి, కోచింగ్ ఇప్పించి ఉద్యోగం కోసం ఎదురుచూసే ఆ తల్లుల బాధ కెసిఆర్‌కి అర్ధం అవుతుందా? అన్నారు. కష్టపడి చదువుకొని అభ్యర్థులు పరీక్ష రాస్తే.. ఆ పరీక్ష రద్దు చేసి వారి ఆశలమీద నీళ్ళు చల్లుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే బిఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేసి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు.
- Advertisement -