Monday, December 23, 2024

ప్రజలందరూ బిజెపి వైపే: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలందరూ బిజెపి వైపే చూస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలవబోతుందని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. దళిత బిడ్డ ఎంఎల్‌ఎ సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటలు మూడు ఫేజ్‌ల కరెంట్ వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని ఆయన సవాల్ విసిరారు.

మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల మాట్లాడారు. తెలంగాణలో 85 శాతం అణగారినవర్గాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఆ వర్గాలకు అధికారపీఠం దక్కకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకైన అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఎల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజా వేదికలపై పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News