Monday, November 18, 2024

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పాత్రియ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న విలేఖకరులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిచాలని బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ చర్చల్లో భాగంగా ఈటెల మాట్లాడుతూ రాష్ట్ర సమాచార శాఖకు 2023-24బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1000కోట్లు కేటాయించిందని దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కెమరామెన్‌లు , డెస్క్‌లో పనిచేసే వారు, రిపోర్టర్లు ఎంతో మంది పేదరికంలోనే మగ్గుతున్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఇళ్లస్థలాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. మండల కేంద్రాల్లో పనిచేసే విలేఖరులకు డబుల్‌బెడ్ ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జర్నలిజాన్నే నమ్ముకొని చిన్న పత్రికల్లో ఎంతో మంది పనిచేస్తున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ ప్రకటనలను చిన్న పత్రికలకు కూడా ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. పెద్ద చిన్న పత్రికలు అన్న వివక్ష చూపరాదని విజ్ణప్తి చేశారు. జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హెల్త్‌కార్డులు అన్ని కార్పోరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు తమ పిల్లలను చదివించుకునేందుకు ఫీజులు భారం కాకుండా ప్రభుత్వం తగిన సాయం అందించాలన్నారు. ఏ కారణం చేతనైనా జర్నలిస్టు మృతి చెందితే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు సాయం అందించి ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు.తెలంగాణ కొత్తరాష్ట్రం అంటూ ఇంకా ఎవరిమీదనో బురదజల్లే ప్రయత్నాలు తగదన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్న గుళ్ల నిర్వహణకోసం చందాలు అడుక్కునే దుస్థితి లేకుండా ప్రభుత్వమే వాటి నిర్వహణకు నిధులు అందజేయాలన్నారు. రాష్ట్రంలో 25లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందున డిస్కమ్‌లు అప్పుల్లో చిక్కుకోకుండా కాపాడాలన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల విధానాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. రిజర్వాయర్లపైన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయటం వల్ల రిజర్వాయర్లలో మత్ససంపద వృద్ది కాదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో పేదకుటుంబాలకు చెందిన విద్యార్దులు కూడా మంత్రి కేటిఆర్‌లాగా ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాలన్నారు. సింగరేణి సంస్థ స్వయంగా బొగ్గు గనులను నిర్వహించాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News