- Advertisement -
హైదరాబాద్ : బొమ్మరాజుపేట రైతులకు అండగా ఉంటానని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే- ఈటల రాజేందర్ అన్నారు. భూబకాసురులను కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి బొమ్మరాసిపేట రైతులు శనివారం చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని..
కొందరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు..ఆయన దృష్టికి తేగా బొమ్మరాసిపేట రైతులు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధరణిలో లక్షల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఈటల డిమాండ్ చేశారు. ఆందోళనతో స్లాట్ బుకింగ్ నిలిపివేస్తామని తహసీల్దార్ సత్యనారాయణ రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
- Advertisement -