Monday, December 23, 2024

శాసన సభ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ స‌స్పెన్ష‌న్‌

- Advertisement -
- Advertisement -

Eetela Rajender

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ పై తెలంగాణ అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్ విధించారు. స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. అసెంబ్లీ స‌బ్ రూల్ 2, రూల్ 340 కింద ఈటెల సస్పెన్షన్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. సభ నుంచి ఈటెల రాజేందర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈటెల రాజేందర్ మర మనిషి అనడం చాలా బాధకరమైన విషయమని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సారీ చెప్పేందుకు ఈటెల నిరాకరించడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News