Thursday, January 23, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కెసిఆర్‌కు లేదు: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము సిఎం కెసిఆర్‌కు లేదని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద బిజెపి పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఐదు వేలకు పైగా ఎకరాల అసైన్డ్‌మెంట్ ల్యాండ్ పేదల నుంచి కెసిఆర్ లాక్కున్నారని ఈటల ఆరోపణలు చేశారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ఈటల డిమాండ్ చేశారు.

Also Read: నిజాం కాలేజ్ లో వసతిగృహ నిర్మాణానికి కెటిఆర్ భూమి పూజ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News