Thursday, January 23, 2025

హైదరాబాద్ లో భూములు అమ్మి రుణమాఫీ చేశారు: ఈటల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ చేస్తామని సిఎం కెసిఆర్ మోసం చేశారని మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మం వేదికగా బిజెపి ఎన్నికల శంఖారావం పూరించింది. రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ సభలో ఈటల మాట్లాడారు. రింగ్‌రోడ్డు, హైదరాబాద్ లో భూములు అమ్మి రుణమాఫీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే అనేక సబ్సిడీలు కెసిఆర్ ఎత్తేశారని, బిజెపికి అధికారమిస్తే కిలో తరుగు కూడా లేకుండా పంట కొంటామని హామీ ఇచ్చారు. కెసిఆర్ ఎత్తేసిన సబ్సిడీలు బిజెపి అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు. బంగారు తెలంగాణ మాటల్లోనే ఉందని చేతల్లో లేదని రాజేందర్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

Also Read: కారుతో డాక్టర్ ను ఢీకొట్టి… బానెట్‌పై 50 మీటర్లు లాక్కెళ్లి (వీడియో వైరల్ )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News