Wednesday, January 22, 2025

ఇందిరా పార్కులో ధర్నాలు ఎందుకు నిషేధించారు కెసిఆర్: ఈటల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: 2014లో తెలంగాణ బిల్లును పాస్ చేయించిన ఘనత బిజెపికే చెందుతుందని ఆ పార్టీ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంటలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఈటల రాజేందర్ మాట్లాడారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు పాసైందని గుర్తు చేశారు. కమలాపురం ఓటర్లు తనని 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని, ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని తనని ఎంఎల్‌ఎగా గెలిపించారని, పైసలు, దావత్‌లు లేకుండానే అనేకసార్లు ఎన్నికల్లో గెలిచానని, హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని ఈటెల రాజేందర్ వివరించారు.

మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో అనేక పనులు చేశానని, హాస్టల్‌లో విద్యార్థుల కష్టాలు తాను అనుభవించానని, అవన్నీ తనకు తెలుసునని, తాను మంత్రిని అయ్యాక హాస్టళ్లకు సన్న బియ్యం ఇచ్చానని, వైద్యశాఖ మంత్రిని అయ్యాక ఆస్పత్రుల్లో వసతులు పెంచానన ప్రశంసించారు. హైదరాబాద్‌లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే సిఎం కెసిఆర్‌కు నచ్చలేదని, సమ్మె చేసిన 1700 మందిని ఉద్యోగాల నుంచి కెసిఆర్ తొలగించారని, ఉద్యమాల గడ్డగా పేరున్న ఇందిరా పార్కులో ధర్నాలు ఎందుకు నిషేధించారని ఈటల రాజేందర్ అడిగారు. విఆర్‌ఎలకు తాను మద్దతివ్వడం సిఎం కెసిఆర్‌కు నచ్చలేదని, హుజూరాబాద్‌లో తనని ఓడించేందుకు కెసిఆర్ చేయని కుట్రలు లేవని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News