Monday, January 20, 2025

తెలంగాణ రాజకీయాల్లో చీడపురుగు ఈటెల: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Etela rajender wrong politics in Telangana

హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్ గెలిచారని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. టిఆర్ఎస్ భవన్ నుంచి బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఈ సారి హుజూరాబాద్ నుంచి ఈటెల పోటీ చేయాలని సవాలు విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో చీడపురుగు ఈటెల అని చురకలంటించారు. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసిన ఈటెలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల వ్యవహారాలను తెలంగాణ సమాజం సహించదని, రాబోయే రోజుల్లో ఈటెలకు తెలంగాణ సమాజమే బుద్ధి చెబుతుందన్నారు.

ఈటెలవి వెన్నుపోటు రాజకీయాలని, శత్రువులతో చేతులు కలిపి కన్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్ ఓడిపోతారని, అందుకు కొత్తరాగం అందుకున్నారని ధ్వజమెత్తారు. ఈటెల రాజకీయం జీవితం ప్రసాదించింది టిఆర్‌ఎస్ పార్టీనేనన్నారు. వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయాల్సిందిపోయి… బిజెపి నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. బిజెపిలో ఈటెల చెల్లని రూపాయ అని, సిఎం కెసిఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే నాలుకలు చీరుస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News