రేవంత్ సవాల్, ఇతర అంశాలపై త్వరలో స్పందిస్తా
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై బిజెపి ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆధారాలుంటే నేరుగా స్పందించాలి కానీ గుళ్లకు వెళ్లి అయ్యతోడు, అమ్మతోడు అనడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. తా ను వ్యక్తులను కించపరిచే రకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ డబ్బును ఎలా పంచుతున్నారనే తాను చెప్పినట్లు ఆయన పే ర్కొన్నారు. రేవంత్ సవాల్ ఇతర అంశాలపై త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి స్పందిస్తానని ఈటల అన్నారు.
శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తాను సింగరేణిపైనే మాట్లాడానని ఆ యన గుర్తు చేశారు. విలేకర్లు అడిగిన ప్రశ్నల సందర్భంగానే ఈ విషయాన్ని ప్రస్తావించానని రాజేందర్ పేర్కొన్నారు. ఆత్మసాక్షిగానే తాను మాట్లాడానని, ధర్మం కోసం, ప్రజల కోసమే తాను మాట్లాడినట్లు ఈటల స్పష్టం చేశారు. ని జమెంటో అబద్ధం ఏంటో ప్రజలే తెలుస్తారని ఈటల అన్నారు. ఎంతమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు బిఆర్‌ఎస్ ప్రాపకంతో బతుకుతున్నారో తె లియదా? అని రాజేందర్ అన్నారు. ఈటల తా టాకూ చప్పుళ్లకు భయపడే రకం కాదన్నారు.