హైదరాబాద్: కొన్ని పార్టీల నేతలు సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం సిఎం కెసిఆర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వాలు బిసిల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టులు కాలువలతో చెరువులను నింపుతున్నామన్నారు. కులం, జాతి ఐక్యంగా ఉంటుందో ఆ వర్గం బాగుపడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మత్స్యకార్మిక సంఘంలో సభ్యత్వం ఇస్తామన్నారు. మత్సకార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలియజేశారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఉన్నాయా?: ఈటెల
- Advertisement -
- Advertisement -
- Advertisement -