Sunday, September 8, 2024

చెస్ట్ ఆసుపత్రిలో కరోనా వార్డులను పరిశీలించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

Etela rajender

 

హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ చాతీ వైద్యశాలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యశాలలో ప్రత్యేకంగా ఉన్న బిల్డింగ్‌ని కరోనా వైరస్‌తో వస్తున్న వారి కోసం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… రెండు బిల్డింగ్‌లలో కరోనా కోసం నాలుగు వార్డులు అందుబాటులో ఉన్నాయని, ఈ వార్డులలో ఎనిమిది వెంటిలేషన్‌తో పాటు 56 బెడ్స్‌ను సిద్దం చేశామని మంత్రి తెలిపారు.

వీటితో పాటు 4 ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆసుపత్రి అధికారులకు సూచించారు. కేరళలో మరో ఐదు కేసులు కొత్తగా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులకు తెలిపారు. జిల్లా కేంద్రాలలో కూడా ఐసొలేషన్ వార్డులను సిద్దం చేయాలని వైద్య ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఇ డా రమేష్‌రెడ్డి, టిఎస్‌ఎంఐడిసి ఎండి డా చంద్రశేఖర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

Etela who inspected corona wards at Chest Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News