Sunday, January 12, 2025

ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

ధర్మారం: ధర్మపురి నియోజవర్గంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో రైతులకు ఎంతో ఉపయోగపడే ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుపడుతూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నిజాలు గ్రహించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.

వెల్గటూర్ మండలం పాసిగామ వద్ద ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమను అడ్డుకోవడం వెనుక కొందరి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. రైతాంగానికి ఎంతో ఉపయోగపడే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్న ఇథనాల్ పరిశ్రమను రాకుండా దుష్టశక్తులు పన్నాగాలు చేస్తున్నాయని ప్రజలే నిజం గ్రహించాలని మంత్రి కోరారు.

శు క్రవారం మంత్రి ఈశ్వర్ మన తెలంగాణతో మాట్లాడారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు, రాకుండా అడ్డుకుంటున్న వైనం, దీని వెనుక ఉన్న సూత్రదారుల వ్యవహారాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ధర్మపురి నియోజకవర్గంలో కేవలం 30 నుండి 40 వేల ఎకరాలు మాత్రమే సాగుకు నోచుకుందని, నేడు 1.20 లక్షల ఎకరాలు సాగవుతుందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఆయకట్టు సాగు విస్తీర్ణం విపీరతంగా పెరిగి లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.

వరి పంట సాగుకు అనుకూలమైన ఈ ప్రాంతంలోనే ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని సీఎం కేసీఆర్ దూర దృష్టితో మంత్రి కెటిఆర్ సంపూర్ణ సహకారంతో పరిశ్రమ మంజూరు చేశారని, 750 కోట్ల వ్యయంతో 2 లక్షల లీటర్ల సామర్థం కలిగినీ పరిశ్రమ రావడం ద్వారా ఇక్కడి రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.

తమ స్వార్థ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, దీంతో పరిశ్రమ ఇక్కడి నుండి తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, పరిశ్రమ రాకుండా ప్రజలను ఉసిగొల్పుతున్నారని అన్నారు.

ముగ్గురు జర్నలిస్టులు తమ స్వార్థ ప్రయోజ నాల కోసం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ పరిశ్రమ వల్ల ఇక్కడి రైతులతోపాటు ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇలాంటి వ్యక్తులకు కోటి లింగాల కోటేశ్వర స్వామి మంచి బుద్ది ప్రసాదించాలని వేడుకు న్నట్లు మంత్రిచెప్పారు.

తనపై వ్యక్తిగతంగా కోపం ఉంటే ఎన్నికల్లో నిలబడి పోరాడాలని, ప్రజల వద్దకు వెళ్లి తాను తప్పు చేసి ఉంటే ఓటు వేయమని చెప్పాలని, ఇలాంటి దుస్సాహ చర్యలకు పాల్పడటం మంచి పద్దతి కాదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల మంచి కోసమే తపించాను తప్ప, ఇలాంటి స్వార్థ పూరిత, వ్యక్తిగత తప్పుడు రాజకీయాలు చేయలేదని మంత్రి ఈశ్వర్ చెప్పారు. ఇథనాల్ పరిశ్రమ రావడం మూలంగా జరిగే లాభం. కొందరు తమ ప్రయోజనాల కోసం చేస్తున్న పనిని ప్రజలే గుర్తించాలని నిజానిజాలు తెలుసుకొని మెలగాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News