Wednesday, January 22, 2025

సామాజిక కార్యకర్త, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సతీమణి ఎథెల్ కెన్నెడీ ఇకలేరు!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్:  సేనేటర్ రాబర్ట్ ఫ్రాన్సిస్ కెన్నెడీ భార్య ఎథెల్ కెన్నెడీ తన 96వ ఏట కన్ను మూశారు. కెన్నెడీ హత్యకు గురైన తర్వాత వారి 11 మంది పిల్లలను పెంచి, దశాబ్దాలుగా సామాజిక సేవలకు , కుటుంబ వారసత్వానికి అంకితం చేస్తూ జీవించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమెను “అమెరికన్ ఐకాన్ – ఆశావాదం , నైతిక ధైర్యం యొక్క మాతృక, స్థితిస్థాపకత ,సేవ యొక్క చిహ్నం” అని పేర్కొన్నారు.

కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ గెలిచిన తర్వాత, జూన్ 5, 1968న లాస్ ఏంజెల్స్‌లోని అంబాసిడర్ హోటల్ వంటగదిలో రాబర్ట్ ఎఫ్. కెన్నెడీని కాల్చి చంపినప్పుడు ఆమె పక్కనే ఉంది. ఆమె బావ ఐదేళ్ల కిందటే డల్లాస్‌లో హత్యకు గురయ్యాడు. ఆమె కుటుంబంలో చాలా మంది దుర్మణానికి గురయ్యారు.

ఆమె తల్లిదండ్రులు 1955లో విమాన ప్రమాదంలో మరణించగా, ఆమె సోదరుడు 1966లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆమె కుమారుడు డేవిడ్ కెన్నెడీ ఓవర్ డోస్‌తో, కుమారుడు మైఖేల్ కెన్నెడీ స్కీయింగ్ ప్రమాదంలో, మేనల్లుడు జాన్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ విమాన ప్రమాదంలో మరణించారు. మరొక మేనల్లుడు, మైఖేల్ స్కాకెల్ ను కనెక్టికట్ సుప్రీం కోర్ట్ చివరికి హత్య చేసిన దోషిగా తేల్చింది. 2019 లో ఆమె మనవరాలు సావోయిర్స్ కెన్నెడీ హిల్ అధిక మోతాదు మత్తు తీసుకుని మరణించింది. కాగా ఎథెల్ కెన్నెడీ కుటుంబం పట్ల విశ్వాసం, భక్తి ద్వారా తనను తాను నిలబెట్టుకుంది. ఆమె విశ్వాసి అయిన కేథలిక్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News