Monday, January 6, 2025

చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ తో ఎతిహాద్ విమానం!

- Advertisement -
- Advertisement -

అబుదాబికి చెందిన విమాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్టు భాగస్వామి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) రంగులు, బ్రాండింగ్‌తో ఉన్న ప్రత్యేక కొత్త విమానాన్ని వెల్లడించింది. ఈ విమానం తొలి ప్రయాణం డిసెంబర్‌లో చెన్నైకి ఉండబోతోంది.

ఎతిహాద్ ఫ్రాంచైజీ ఐకానిక్ పసుపు, నీలం రంగులలో Airbus A320 నియో వీడియోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది, దాని బాడీపై  సిఎస్ కె  బోల్డ్ లోగో ఉంది.

ఈ వీడియో అనతి కాలంలోనే మూడు లక్షలకు పైగా వీక్షణలను పొందింది.  చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వ్యాఖ్యలతో తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఒక అభిమాని ఇలా వ్రాశాడు: “నేను చాలా ఇష్టపడేది ఇదే! చెన్నై సూపర్ కింగ్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ కు ధన్యవాదాలు.’’ మరొకరు ఇలా వ్రాశారు, “ఇది ఊహించనిది, కానీ నేను దీన్ని పూర్తిగా అభిమానిస్తున్నాను.”

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News