మన తెలంగాణ,సిటీబ్యూటీ: నూతన విద్యా విధాన కార్యాచరణ ద్వారా భారతీయులందరికి నాణ్యమైన విద్యావకాశాలను మెరుగుపరుస్తామని లాభ పేక్ష లేకుండా చేస్తామని ఈటిఎస్ ఇండియా ప్రకటించింది. తమ కార్యకలపాలను నిర్వహించేందుకు కార్యాలయం ఏర్పాటుతో పాటుగా అంతర్జాతీయ పాదముద్రికలను విస్తరించి, అభ్యాసకులకు తమ జీవితాంతపు విద్యా ప్రయాణంలో సేవలు అందిస్తామని నిర్వహకులు తెలిపారు. లెజో శామ్ ఊమ్మెన్ ఈటిఎస్‌కు ఎండీ సేవలందిస్తారని, తమ ఉత్పత్తులు, సేవల కోసం వృద్ది వ్యుహాలను అభివృద్ది చేయడంతో పాటుగా అమలు చేయడం ఊమ్మెన్ చేస్తారని తెలిపారు.
పిటిఇ అకడమిక్ పరీక్ష ఆయన పర్యవేక్షణలో జరిగిందని, ఈసంస్ద శక్తివంతమైన వ్యాపార పనితీరుకు, వృద్ది, ఆదాయం, నిర్వహణ పనితీరు, లాభదాయకత పరంగా ఆయన అందించిన తోడ్పాటు పరంగా గుర్తింపు పొందారు.ఆయన పియర్శన్‌కు ముందు, రిలయన్స్‌మనీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ తదితర సంస్దలో ఆయన కీలక బాధ్యతు నిర్వహించారని, బెంగుళూరు యూనివర్శిటీ పూర్వ విద్యార్ది ఉన్నట్లు సంస్ద ప్రతినిధులు వెల్లడించారు.