Monday, December 2, 2024

తెలంగాణ అడవిలో మళ్లీ తుపాకుల మోత

- Advertisement -
- Advertisement -

ఏటూరునాగారం సమీపంలోని చల్పాక అడవిలో ఎదురుకాల్పులు మృతుల్లో యాక్షన్ టీం కమాండర్ భద్రు ఆయుధాలు
స్వాధీనం 15 ఏళ్ల తరువాత ములుగు జిల్లాలో ఇదే భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు వారోత్సవాలకు ఒకరోజు ముందు పోలీసుల
పంజా ఇటీవల ఇదే జిల్లాలో ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరిని హత మార్చిన మావోయిస్టులు

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలం చల్పాక అడవిలో పూలకొమ్మ గొత్తికోయగూడెం శివారు ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల 18 నిమిషాల ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏ డుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతు ల్లో కీలక నేతలు యాక్షన్ టీం కమాండర్ భద్రు ఉన్నాడు. భద్రుపై 20 లక్షల రివార్డు ఉంది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అడవులలో వరుస భారీ ఎన్‌కౌంట ర్ల తర్వాత మావోయిస్టులు తెలంగాణవైపు వస్తున్నారని తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యా రు.

ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండలం పే రూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఊకె రమేష్ అతని తమ్ముడు అర్జున్‌ను మావోయిస్టులు ఇన్ఫార్మన్ నెపంతో హత్య చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి నుంచి కూంబిం గ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టులు ఏటూరునాగారం మండలం చల్పాక వద్ద అటవీప్రాంతంలో తారసపడ్డారు. దీంతో పోలీసు లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగా యి. దాదాపు మూడు గంటల పాటు హోరాహోరి గా జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, అందులో ఇద్దరు క మాండర్లు, ఒకరు డివీసిఎం, ఇద్దరు ఏసిఎంలు, మరో ముగ్గురు పార్టీ సభ్యులు ఉన్నారు.

ఇందులో భద్రుపై 20 లక్షల రివార్డు ఉంది. భద్రు, మధు వ ద్ద ఏకె 47 గన్‌లు, దేవల్, జమున వద్ద 303 రైఫి ల్, మిగిలిన ముగ్గురు వద్ద ఇన్సాన్ రైఫిల్, ఎస్‌బిఎల్ గన్‌లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మృతులలో కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న ఇల్లందు, నర్సంపేట టిఎస్‌సిఎం కార్యదర్శి, ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ఏటూరునాగారం, మహదేవపూర్ డివిసిఎం కార్యదర్శి, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ ఏసి, ముస్సాకి జమున ఏసిఎం, జైసింగ్ పార్టీ సభ్యుడు, కిషోర్, కామేష్ లు పార్టీ సభ్యులు.

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..

ప్రజా గెరిల్లా సైన్యం ఆవిర్భవించి 24 సం వత్సరాలు గడుస్తున్న సందర్భంలో డిసెంబర్ 2 నుంచి 8 వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌తో పోలీసులు సవాల్ విసిరారు.

లొంగిపోమ్మని హెచ్చరించాం: ఎస్పీ

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో ఇద్దరు అమాయక గిరిజనులు ఉయికే రమే ష్, అర్జున్ లను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా జిల్లా పోలీస్ బృందం మావోయిస్టు వారోత్సవాల లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల 18 ని మిషాల సమయంలో ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామంలోని పూలకొమ్మ అటవీప్రాంతం లో పెట్రోలింగ్ చేస్తుండగా సుమారు 12 నుండి 13 మంది ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు లు ఆలీవ్ గ్రీన్ దుస్తులు ధరించి పోలీసులను చూసి కాల్పులు ప్రారంభించగా పోలీసులు లొంగిపొమ్మ ని పలుమార్లు హెచ్చరించినా వినకుండా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణకోసం ఎదురుకాల్పులు జ రిపినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు.

కొంతసమయం తర్వాత సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా ఏడుగురు సభ్యులు సభ్యులు ఉన్న ట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ క్యాడర్‌కు చెంది న జెఎండబ్లుపి డివిసి సభ్యులు కుర్సం మంగు అ లియాస్ భద్రు అలియాస్ పాపన్న ఏగోలపు మల్ల య్య అలియాస్ కోటి జిల్లా కమిటీ సభ్యుడు, జము న ఏరియా కమిటీ సభ్యురాలు, కరుణాకర్ ఏరి యా కమిటీ సభ్యుడిగా గుర్తించినట్లు మిగతా ము గ్గురు పార్టీ సభ్యులను గుర్తించాల్సి ఉందని తెలిపా రు. వీరి వద్ద నుంచి రెండు ఏకె 47, జి 3, ఒక ఇన్‌సాస్, ఒక 303 రైఫిల్, ఒక సింగల్ షాట్, ఒక తపంచా, కొన్ని కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

ఏజెన్సీలో హై అలర్ట్

ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని చ ల్పాక అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలు ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాలలో పోలీసులు సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్ కౌంటర్ కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేసి అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

అంతా 24 ఏళ్ల వయసు వారే…

ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా అం దులో 24 సంవత్సరాలలోపు వారు ఐదుగురు ఉండటం గమనార్హం. దశాబ్దంన్నర కాలం త ర్వాత ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఇదే. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే నెపంతో గత నెల 21 న అర్థరాత్రి సమయంలో ములుగు జిల్లా వాజేడులో పె నుగోలు కాలనీలో పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేష్, అతని సోదరుడు అర్జున్‌ను మావోయిస్టులు హత్య చేయడం జరిగింది. వెంకటాపురం, వాజేడు ఏరియా కమి టీ కార్యదర్శ శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను మృ తదేహాల వద్ద వదిలి వెళ్లా రు. ఈ ఘటన జిల్లా వ్యా ప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్ర మంలోనే ఏటూరునాగారంలో ఆదివాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ సైతం నిర్వహించడం జరిగింది. శనివారం ఏటూరునాగారం, వెం కటాపురం, వాజేడు మండలాలలో మావోయిస్టుల చర్యలకు నిరసనగా వారికి వ్యతిరేకంగా బ్యా నర్లు వెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News