- Advertisement -
లండన్ : ఒమిక్రాన్ వేరియంట్ విలయం నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన టీకాను బూస్టర్ డోసుగా వినియోగించడానికి యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం సిఫార్సు చేసింది. ఫైజర్, మోడెర్నా, టీకాలతోపాటు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నిర్ధారించిన వ్యాక్సిన్లలో ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత మూడో డోసుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాను కూడా బూస్టర్ డోస్గా వేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
- Advertisement -