Wednesday, January 22, 2025

చమురు నిషేధ ప్రతిపాదనపై ఇయూ చీఫ్ ఏకాభిప్రాయాన్ని కోరుతున్నారు

- Advertisement -
- Advertisement -

బ్రస్సెల్స్: రష్యా నుండి చమురు దిగుమతులను నిషేధించాలనే యూరొపియన్ యూనియన్(ఇయూ)  యొక్క కార్యనిర్వాహక విభాగం ప్రతిపాదనపై ఏకాభిప్రాయాన్ని పొందే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ హంగేరీకి వెళుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రతినిధి వాన్ డెర్ లేయెన్ సోమవారం హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌తో సమావేశమై “యురోపియన్ ఇంధన సరఫరా భద్రతకు సంబంధించిన సమస్యల” గురించి చర్చిస్తారని చెప్పారు.

రష్యాను లక్ష్యంగా చేసుకున్న ఆంక్షల యొక్క ఆరవ ప్యాకేజీని స్వీకరించడానికి చర్చలలో పురోగతిని హంగేరీ నిరోధించింది.  27 యూరొపియన్ యూనియన్ దేశాల రాయబారులు ఇప్పటివరకు కొత్త రౌండ్ చర్యల వివరాలను అంగీకరించడంలో విఫలమయ్యారు.

సంవత్సరం చివరి నాటికి యూరొపియన్ యూనియన్  సభ్య దేశాలు ఆరు నెలల్లోపు ముడి చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తుల దిగుమతులను  నిలిపివేయాలని వాన్ డెర్ లేయన్ ప్రతిపాదించారు. కాగా  ప్రతిపాదిత ఆంక్షలకు ఓటు వేయబోమని హంగేరీ చెబుతోంది, ఇది తన ఆర్థిక వ్యవస్థపై “అణు బాంబు” ప్రభావాన్ని చూపగలదని ,  దాని “స్థిరమైన శక్తి సరఫరా”ను నాశనం చేస్తుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News