Saturday, December 21, 2024

మణిపూర్‌పై బిజెపి తీరు గర్హనీయం

- Advertisement -
- Advertisement -

స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : భారతదేశంలోని మణిపూర్‌లో హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఇయూ) గురువారం ఓ తీర్మానం వెలువవరించింది. తీర్మానంలో బిజెపి నేతలు కొందరు వ్యవహరిస్తున్న తీరును ఇయూ ఘాటుగా తప్పుపట్టింది. బిజెపి ప్రముఖులు మణిపూర్ హింసాకాండ పట్ల జాతీయత పేరిట చెపుతున్న మాటలు గర్హనీయం అని పేర్కొన్నారు. మణిపూర్‌లో హింసాకాండ తీవ్ర విషయం, దీనిపై నివారణ చర్యలు కీలకం అని ఇయూ స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన వేళలోనే ఇయూ నుంచి కీలక తీర్మానం వెలువడటం చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యం, చట్టపరమైన పాలన వంటి వాటిపై చర్చల అజెండాలో మణిపూర్‌లో తెగల ఘర్షణలు, ప్రస్తుత పరిస్థితి అంశాన్ని కూడా ఇయూ చేర్చింది.

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ప్లీనరీ సెషన్ జరుగుతోంది. మానవహక్కులు, ప్రజాస్వామిక విలువల అంశం భారత్‌తో తమ చర్చల ప్రక్రియకు ఆయువుపట్టు అవుతాయని కూడా ఇయూ ఘాటుగా పేర్కొంది. అధికారంలో ఉన్న బిజెపి నేతలు కొందరు ఈ నేపథ్యంలో వ్యవహరిస్తున్న తీరు అనుచితంగా ఉందని కూడా ఇయూ ఖండించింది. మణిపూర్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు పూర్తిస్థాయి విభజన విద్వేషకర విధానాలను అవలంభిస్తున్నాయని ఇయూ మండిపడింది. ఇయూకు భారత్ గట్టి కౌంటర్ వెలువరించింది. ఇయూ పార్లమెంట్ మణిపూర్ అంశంపై తీర్మానం చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఇక్కడి విషయం పూర్తిగా దేశ ఆంతరంగిక విషయం అని స్పష్టం చేసింది. ఇయూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News