Monday, December 23, 2024

యురప్‌లో 70 లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

కోపెన్‌హేగెన్: యూరప్ దేశాలలో గడచిన రెండు వారాలలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రెట్టింపు అయ్యాయి. జనవరి మొదటివారం ముగింపు నాటికి 70 లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తమ ప్రాంతంలోని 26 దేశాలలలో ప్రతివారం ఒక శాతం మంది ప్రజలు కరోనా వైరస్ బారినపడుతున్నారని డబ్లుహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్యూజ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాలలో పశ్చిమ యూరప్‌లోని సగం జనాభా కొవిడ్ 19 బారినపడే అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అంచనా వేసినట్లు ఆయన చెప్పారు.

ఇతర వేరియంట్ల కన్నా అత్యంత వేగంగా, విస్తారంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాలతో కార్యాలయాలు, ఇతర ఇన్‌డోర్ ప్రదేశాలలో కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, హెల్త్ వర్కర్లతోపాటు వృద్ధులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవడం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.

Europe report 70 lakh Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News