Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ శరణార్థులను స్వాగతిస్తున్న యూరొప్

- Advertisement -
- Advertisement -

Europe Welcoming Ukrainian Refugees

 

బార్సిలోనా: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి వేలాది మంది పౌరులు పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఒక చేతిలో చిన్నారులను మరో చేతిలో పెట్టేబేడా పట్టుకుని మహిళలు దేశం వదులుతుండడం అనేకులను ఆవేదనకు గురిచేస్తోంది. అయితే వారిని పొలాండ్, హంగరీ, బల్గేరియా, మోల్డోవా, రొమానియాకు చెందిన నాయకులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. “వీరు శరణార్థులు కాదు. వీరు యూరొపియన్లే. వీరు తెలివైనవారు, విద్యావంతులు, మనమంటున్నట్లు ఇదేమి శరణార్థుల వేవ్ కాదు, ప్రస్తుత శరణార్థుల రాకకు ఏ ఒక్క యూరొప్ దేశం భయపడ్డంలేదు.

” అని బల్గేరియా ప్రధాని కిరిల్ పెట్కోవ్ ఈ వారం జర్నలిస్టులతో అన్నారు. కాగా దీనికి సిరియన్ జర్నలిస్ట్ ఒక్బా ముహమ్మద్ “ఆయన(పెట్కోవ్) జాత్యహంకారం, ఇస్లామోఫోబియాను కలిపి మాట్లాడుతున్నారు” అన్నారు. ముహమ్మద్ 2018లో తన స్వస్థలం దరాను వదిలేసి వచ్చి ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తున్నారు. “శరణార్థి శరణార్థే, అతడు యూరొపియన్, ఆఫ్రికన్, ఆసియావాసి ఎవరైనా కానీ…” అని ముహమ్మద్ అన్నారు.

ఇదిలావుండగా “మేము ఫలానా అని కాకుండా అందరినీ అనుమతిస్తున్నాము” అని హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ అన్నారు. హంగరీ గుండా యూరొప్‌లోకి ప్రవేశించాలనుకుంటున్న మధ్య ప్రాచ్య, ఆఫ్రికా శరణార్థులు, ప్రవాసులను ఉద్దేశించి ఆయన డిసెంబర్‌లో ప్రసంగించినప్పుడు తెలిపారు. పాశ్చాత్య ఉక్రెయిన్‌లో 1,50,000 మంది హంగేరియన్ జాతీయులు ఉన్నారు. వారిలో చాలా మంది వద్ద హంగరీ పాస్‌పోర్ట్ కూడా ఉంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకు వస్తుండడంతో చాలా మంది ఉక్రెయిన్ వదిలి పొరుగు దేశాలకు పలాయనం చిత్తగిస్తున్నారు. వారిలో ఉక్రెయిన్లే కాదు, నైజీరియన్లు, భారతీయులు, లెబనీయులు, వైగార ఉన్నారు వారంతా పొలాండ్ సరిహద్దులో చిక్కుకుని ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News