Sunday, January 19, 2025

యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

European Parliament President David Sassoli Passed Away

రోమ్: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు దేవిడ్ ససోలి ఇటలీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూసినట్లు ఆయన ప్రతినిధి మంగళవారం ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈశాన్య ఇటలీలోని అవియానో నగరంలో తెల్లవారుజామున 1.15 గంటలకు ససోలి మరణించినట్లు ఆయన ప్రతినిధి రాబర్టో క్యులో తెలిపారు. ఇతర వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. రోగ నిరోధక శక్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో అస్వస్థులైన ససోలి గత నెల 26న ఆసుపత్రిలో చేరారు. 65 సంవత్సరాల ససోలి 2009లో యూరోపియన్ పార్లమెంట్‌కు మొదటిసారి ఎన్నికయ్యారు. 2014లో మరోదఫా ఎన్నికైన ఆయన పార్లమెంట్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న ససోలి ఈ నెలాఖరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో మరోదఫా పోటీ చేయబోనని ఇదివరకే ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం ఉంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 45 కోట్ల మంది పౌరులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఏడు శాఖలలో ఒకటైన ఇందులో 700 మందికి పైగా సభ్యులను సభ్య దేశాలు నేరుగా ఎన్నుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News