మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ , ఇతర మౌళిక వసతులు పెంచేందుకు టిఎస్ రెడ్కో కృషి చేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. ఈ దిశగా రాష్ట్రంలో 2025 కల్లా 3 వేల కు పైగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాల ఏర్పా టు లక్షంగా ముందుకెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిఎం కెసిఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిల సహకారంతో ముం దుకు వెళ్తున్నామన్నారు. దీనికి వివిధ సం స్థలు కూడా సహకరించాలని సతీష్ రెడ్డి కోరారు. మౌ ళిక వసతుల కల్పనను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఎలక్ట్రిక్ వాహన రంగం దాని అనుబం ధ రంగాలకు చెందిన ప్రతినిధులతో బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజీ (ఆస్కీ) ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే ఎక్కువ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఓ రోడ్ మ్యాప్ తయారీలో భాగంగానే సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ మారుమూల ప్రాంతంలోనూ ఛార్జింగ్ వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోనూ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ వసతి కల్పిస్తామన్నారు. గత ఏడాదిలో రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర ర హదారులు పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఛా ర్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్రజలకు ఎలక్ట్రిక్ వా హనాలపై ధీమా కల్పించడమే లక్షమని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొ నుగోలుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. దీని కోసం ఎలక్ట్రిక్ వాహన రంగంలోని సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రెడ్కో స్వయంగా ఇప్పటికే 150 ఛార్జింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేసిందని, త్వరలోనే మరిన్ని ఏ ర్పాటు చేయబోతున్నామని సతీష్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో దేశంలోనే మొదటి ఛా ర్జింగ్ కేంద్రం యాదాద్రిలో ఏర్పాటు చేశామన్నా రు. ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముం దు కు రావాలని సతీష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రభు త్వ, ప్రైవేటు అన్నీ కలిపి హైదరాబాద్‌లో దాదా పు 500 ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటి సంఖ్య త్వరలోనే మారింత పెరుగుతుందని సతీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్కో వైస్ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జాన య్య, జిఎం ప్రసాద్, వాహన తయారీ సంస్థలు, వాహన డీలర్లు, ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ సం స్థలు, ఫ్లీట్ సర్విస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.