Thursday, April 17, 2025

BattREతో EV91 భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ప్రముఖ అగ్రిగేటర్ EV91టెక్నాలజీస్, భారతదేశంలో బి 2బి ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో మార్గదర్శక సంస్థ అయిన BattRE ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్సింగ్ సొల్యూషన్‌ సంస్థ అయిన evpeతో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. సంయుక్తంగా 10,000 EVలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా పట్టణ , గ్రామీణ రవాణా రెండింటి భవిష్యత్తును పునర్నిర్వచించాలని ఈ భాగస్వామ్యం ప్రయత్నిస్తుంది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు EV91 టెక్నాలజీస్ మధ్య కీలక భాగస్వామ్యాన్ని స్టార్టప్ ఎనేబుల్ అయిన BizDateUp సులభతరం చేసింది.

ఈ భాగస్వామ్యం గురించి, BattRE వ్యవస్థాపకుడు & ఎండి నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ నాణ్యత , సాంకేతికతలో అత్యున్నత స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందించడమే తమ లక్ష్యం. ఈ భాగస్వామ్యం పరస్పర ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నామన్నారు.

“EV91టెక్నాలజీస్ ఆగస్టు 2023లో కార్యకలాపాలను ప్రారంభించి, వేగవంతమైన వృద్ధితో ముందుకు సాగుతోంది. మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే వంటి నగరాలతో పాటుగా టైర్ I, II నగరాల్లోకి విస్తరిస్తున్నాము. మరిన్ని EVలను రోడ్డుపైకి తీసుకురావడం ఆరోగ్యకరమైన, హరిత భవిష్యత్తును సృష్టించడానికి సహాయపడుతుంది, ”అని EV 91 వ్యవస్థాపకుడు, సీఈఓ అరుణ్ కుమార్ అన్నారు.

evpe సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహన్ యెగ్గినా ఈ కార్యక్రమం వ్యూహాత్మక ప్రభావాన్ని వెల్లడిస్తూ “BattRE, EV91 తో ఈ సహకారం ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే తమ నిబద్ధతను నొక్కి చెబుతుంది. BattRE వ్యవస్థాపకులు పంకజ్ శర్మ, నిశ్చల్ చౌదరి, సహ వ్యవస్థాపకుడు సూరజ్ పెనుకొండతో కలిసి పనిచేయడం ద్వారా ప్రభావవంతమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను రూపొందించడానికి మాకు వీలు కల్పించింది” అని అన్నారు.

BizDateUp వ్యవస్థాపకుడు జీత్ చందన్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి ఈ పరిశ్రమ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News