- Advertisement -
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో భారీవర్షాలు, రవదలతో చిక్కుపడ్డ 256 మంది యాత్రికులను గురువారం సురక్షితంగా తరలించారు. చందర్‌తల్‌లో భారీ స్థాయిలో మంచు చరియలు విరిగిపడటంతో ఐదురోజులుగా రాకపోకలు నిలిచిపొయ్యాయి. దీనితో లాహౌల్, స్పితిల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు చిక్కుపడ్డారు. ఇప్పుడు ఇక్కడ నిలిచిపోయిన వారిని బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా గడిచిన నాలుగురోజులలో హిమాచల్ ప్రదేశ్‌లో అష్టదిగ్బంధనంలో చిక్కుపడ్డ 60,000 మంది టూరిస్టులను తరలించినట్లు వివరించారు. భారీ వర్షాలు , మంచుచరియల పతనంతో , ఆకస్మిక వరదలతో పలు చోట్ల రాదార్లు దెబ్బతిన్నాయి. ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
- Advertisement -