Friday, November 15, 2024

సౌదీ సాయంతో కదలిక.. సూడాన్‌లోని భారతీయుల తరలింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సౌదీ అరేబియా సంపూర్ణ సహకారంతో సూడాన్‌లో చిక్కుపడ్డ భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అయింది. అంతర్యుద్ధ పరిస్థితులు, మారణహోమం నడుమ సూడాన్ రగలిపోతున్న దశలో అక్కడ పలు ప్రాంతాలలో ఉన్న దాదాపు 4వేల మంది భారతీయుల పరిస్థితిపై భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దశలో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. అంతకు ముందే విదేశాంగ మంత్రి జైశంకర్ సౌదీ అరేబియా , ఈజిప్టు వంటి దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడి సూడాన్‌లోని భారతీయుల రప్పింతకు సహకరించాలని కోరారు. ఈ దిశలో ముందుగా సౌదీ స్పందించింది. సైన్యం , పారామిలిటరీ బలగాల మధ్య ఎడతెరిపి లేకుండా సాగుతోన్న ఘర్షణల సూడాన్‌నుంచి భారతీయులను తిరిగితీసుకువచ్చే క్రమం అత్యంత సున్నితమైనది కావడంతో సూడాన్‌నుశాసించగలిగే స్థితిలో ఉన్న సౌదీ సాయం అభ్యర్థించడంతో సౌదీ ఇందుకు అంగీకరించడంతో ఇప్పుడు భారతీయులు క్షేమంగా తిరిగివచ్చేందుకు వీలేర్పడింది.

సంబంధిత తరలింపు గురించి సమగ్ర విధివిధానాలు రూపొందించుకుని కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. యుద్ధ ప్రాతిపదికననే వీరి తరలింపు ఉంటుందని సౌదీ నుంచి ఇప్పుడు భారత దేశానికి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. చిక్కుపడ్డ భారతీయులను సూడాన్ తీరం మీదుగా నౌకల ద్వారానే ముందుగా సౌదీకి తీసుకువచ్చి అక్కడి నుంచి ఇండియాకు పంపించడం సురక్షితం అవుతుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ భావిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని సౌదీ వర్గాలు ధృవీకరించాయి. తమ స్పందన కూడా తెలిపాయి. సౌదీ సాయంతో శనివారం 12 దేశాలకు చెందిన 66 మంది పౌరులు సూడాన్ నుంచి నౌకలలో ముందుగా జెడ్డా చేరారు. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News