ఈవ్‌టీజర్లకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
ఎడిజిపి స్వాతిలక్రా
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళలపట్ల అనుచితంగా వ్యవహరించిన ఈవ్‌టీజర్లలో మార్పుకోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, కౌన్సెలింగ్‌లో పోకిరీలు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎడిజిపి స్వాతిలక్రా పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడిజిపి స్వాతిలక్రా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్‌టీజింగ్, వేధింపులకు సంబంధించి కేసులు నమోదైన 106మంది మేజర్లు, 08 మైనర్లకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈక్రమంలో గత ఏడాది డిసెంబరులో ఈవ్-టీజింగ్, ఫోన్‌పై వేధింపులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వేధింపులు పాల్పడిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. శ్రీస్వామి వివేకానంద చెప్పినట్లు ఒక దేశం యొక్క పురోగతికి ఉత్తమమైన థర్మామీటర్ మహిళలను గౌరవించడమేనన్నారు. తప్పుడు దారిలో ప్రయాణించే వారిలో ప్రవర్తనలో మార్పు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ వల్ల కొంతమేరకు వేధింపులు తగ్గాయన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో సైబరాబాద్, ఖమ్మం కమిరేటరేట్‌లతో పాటు పలు జిల్లాల పనితీరులో చాలా మార్పు వచ్చిందని, ఆయా ప్రాంతాలలో షీ బృందాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తుల రికార్డులను ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
కాగా రాష్ట్రం వ్యాప్తంగా 114 పోకిరీల కౌన్సెలింగ్ నిర్వహించగా వారిలో హైదరాబాద్ -32, నిజామాబాద్ – 13, నల్గొండ – 09, కరీంనగర్ – 09, రాచకొండ. ఆరుగురు ఇతర జిల్లా నుంచి పాల్గొన్నారన్నారు. అనంతరం డిఐజి సుమతి మాట్లాడుతూ ఇది డబ్ల్యుఎస్‌డబ్ల్యు నిర్వహించిన 4 వ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ అని వివరించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అవసరమైన సాంకేతికతను కలిగి ఉందని, మహిళల పట్ల నేరాలకు పాల్పడిన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. మహిళలపై వేధింపులకు సంబంధించి 2020లో నల్గొండ, కామారెడ్డిలో అత్యధికంగా కేసులు నమోదు చేశామన్నారు. వాట్సాప్, ఇమెయిల్, ట్విట్టర్, హాక్-ఐ ద్వారా 69 ఫిర్యాదులు అందయాని, వాటిలో 43 మంది 19- నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారున్నారన్నారు. ఆన్‌లౌన్ సమావేశంలో షీటీం అధికారులు, సిబ్బందితో పాటు డాక్టర్ గీతాచల్లా, సైకాలజిస్ట్ రిటైర్డ్ ప్రొఫసర్ ప్రేరణ డాక్టర్ వి.విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.