Sunday, November 17, 2024

పక్షం రోజులు దాటినా నడి రోడ్డుపైనే పూడిక

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : మహానగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) చార్మినార్ జోన్ పరిధిలో కచ్చామోరీల నిర్వాహణ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తెచ్చినా తమ పద్ధ్దతిలో మార్పులేదని నిరూపిస్తున్నారు కొందరు అధికారు లు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్‌ఎంసి పరిధిలో పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చింది. కొత్తగా ప్రతి డివిజన్లో అన్ని శాఖల అధికారులతో కూడిన వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆ డివిజన్ ప్రజలు సమస్యలను వార్డు కార్యాలయం అధికారుల దృష్టికి తీ సుకువస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంది.

అ యితే అధికారులలో చిత్తశుద్ధి లోపించింది. పరిస్థితి బల్దియాకు సమస్యలు కనిపించవు, వినిపించవు అన్న చం దంగా తయ్యారైయ్యింది. ఈనెల ఏడవ తేదీన జంగమ్మె ట్ డివిజన్ ఛత్రినాక శివగంగానగర్ ప్రధాన రోడ్డుపై క చ్చామోరీ ఏరులై పారింది. బస్తీని, రోడ్లను ముంచెత్తెతిం ది. బస్తీవాసులు విషయాన్ని బల్దియా దృష్టికి తీసుకువెళ్ళారు. అధికారులు ఈనెల 9న ఆలస్యంగా స్పందించి నామ్కేవాస్తేగా పూడిక తీయించారు. తిరిగి జూన్ 15న పూర్వపు స్థితికి చేరుకొని మరింత ఉధృతంగా ఉప్పొంగిం ది. సమస్యను జఠిలం చేసింది. ఈసారి మురుగు రోడ్డు, బస్తీలో ఏకధాటిగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరా యం కలిగించింది. విషయాన్ని మరోసారి బల్దియా దృ ష్టికి తీసుకువెళ్లారు.

ఈసారి త్వరగా స్పందించిన అధికారులు పూడిక తీసే కార్మికులచే అదే మ్యాన్‌హోళ్ళలో మ రోసారి పూడిక తీయించారు. సమస్య మెరుగైయ్యింది. ఇంత వరకు బాగానే ఉంది. తీసిన పూడిక రోడ్డు మ ధ్యలో, మ్యాన్ హోల్ పక్కనే వేశారు. దాదాపు పక్షం రో జులు దాటినా ఇంత వరకు ఎత్తలేదు. రెండు సార్లు తీసి న పూడిక రోడ్డు మధ్యలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. రెండు వాహనాలు ఎదురైనపుడు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వాహనాలు పూడికను తోసుకుంటూ వెళుతూ రోడ్డంతా విస్తరించేలా చేస్తున్నాయి. దీంతో వాహనదారులు విషయం తెలియక జారి పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వ ర్షాలకు పూడిక తడిసి ముద్దైయ్యింది.

రోడ్డుపై పారే వర ద పూడికను ముంచెత్తుతుంది. ఫలితంగా పూడిక రో డ్డుపై విస్తరించి ఇబ్బంది కరంగా మారింది. ప్రతిరోజు రోడ్లను ఊడ్చే పారిశుధ్య కార్మికులు సైతం సమస్యను ప ట్టించుకోవటం లేదు. మరి కచ్చామోరీలలోంచి తీసిన పూడికను ఎవరు ఎత్తాలి, సమస్యను ఎవరు పరిష్కరించా లో తెలియక బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూడిక తీత, ఎత్తే విషయంలోనే బల్దియా పనితీరు ప్రతిబింభిస్తుంటే మిగితా విషయాలలో ఎలా వుంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బల్దియా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బస్తీవాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News