Monday, January 20, 2025

భారమైనా.. బియ్యం పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టిందని ,పదేళ్ల బిఆర్‌ఎస్ సివిల్‌సప్లైస్ సంస్థపైన రూ.58860కోట్లు రుణభారం పడిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ధికశాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శనివారం సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అమలు చే స్తున్న పథకాలు, శాఖ ఆర్థిక పరిస్థితులు, 202425 ఆర్థిక సంవత్సరానికి అమలు చే యాల్సిన పథకాలకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలుపై ఆ శాఖ ఉన్నతాధికారులతో డి ప్యూటీ సిఎం భట్టితో పాటు నీటి పారుదల పౌర సరఫరాల శాఖమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లు విక్రమార్క మాట్లాడుతూ సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. 2014-15నాటికి ఈ శాఖకు ఎరియర్స్ రూ.380 కోట్లు ఉంటే,2024నాటికి రూ.14350 కో ట్లకు బకాయిలు పెరిగాయన్నారు.సమావేశంలో అధికారులు చెప్పిన లెక్కలు వింటుంటే అచ్చర్యం వేసిందన్నారు. 2014నాటికి ముందు ఉన్న ప్రభుత్వాలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు చెల్లించేవన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సి విల్ సప్లై పై భారీగా భారం పడిందని తెలిపారు. ప్రభుత్వం సివిల్ సప్లై కి నిధులు సరైన సమయానికి చెల్లించకపోవడం వల్ల అన్ని లోన్స్ కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.58860 కోట్లు భారం పడిందని వివరించారు.

రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం అ ప్పులు చేసిందన్నారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలం టే ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే తప్ప ధాన్యం కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంతటి భారం ఉన్నప్పటికీ పేదలకు రేషన్ బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పనుల్లో ఏవిధమైన ఆలస్యం కాకుండా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణను బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేతుల్లో పెడితే తెలంగాణను ఆగం ఆగం చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2.82కోట్ల మంది లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేసినప్పుడు కూడా పౌరసరఫరాల శాఖపై ఇంత అప్పుల భారం పడలేదన్నారు. గత ప్రభుత్వం సివిల్‌సప్లైస్ శాఖలో చేసిన ఆర్ధిక అరాచకత్వం గురించి వాస్తవిక విషయాలే తాము చెబుతున్నామన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్నికష్టాలు వచ్చినా వాటిని అధిగమించి ఇందిరమ్మ రాజ్యం కోసం అహర్నిషలు కృషి చేస్తామని డిప్యూటి సిఎం మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. పౌర సరఫరాలు నీటి పారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సివిల్ సప్లై సంస్థను గత ప్రభుత్వం ఆర్థికంగా నిర్వీర్యం చేసిందన్నారు. రైతులనుంచి ధాన్యం సేకరించి, నిరుపేద కుటుంబాలకు బియ్యం సరఫరాచేసే సంస్థపైన 58వేల కోట్లు ఆప్పుల భారం మోపిందన్నారు. పౌరసరఫరాలశాఖ 11వేల కోట్ల నష్టంలో ఉందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News