Monday, December 23, 2024

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినా మునుగోడు టికెట్ నాదే…

- Advertisement -
- Advertisement -

టిపిసిసి ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమని ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా స్వాగతిస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో చేరినా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని తానేనంటూ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం, సిపిఎం, సిపిఐ మద్ధతుతో తాను పోటీలో ఉంటానని తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం మునుగోడు టికెట్ పై నాకు పూర్తి హామీ ఇచ్చిందని కృష్ణారెడ్డి వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడని, ఆయన రాష్ట్రంలో ఎక్కడనుండైనా పోటీ చేయవచ్చన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు టికెట్టుపై తనకు ఖచ్చితమైన హామీ ఇచ్చిందన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని మునుగోడు సీటును వదిలేయాలని కోరుతున్నానని చలమల్ల కృష్ణారెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News