Saturday, November 23, 2024

40శాతం గ్రాంట్లకు కేంద్రం కోతపెట్టినా.. మన ఆర్థికం సురక్షితం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన గ్రాంట్లలో 44శాతం తగ్గాయని కంట్రోలర్ అండ్ అడిట్ జ నరల్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం నాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. 2021–22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్‌పై కాగ్ నివేదించింది. నీటి పారుదల, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల పైన వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం అధికంగా నిధులు ఖర్చు చేసిందని తెలిపింది. గృహ నిర్మా ణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో పేర్కొంది. పెరుగుతున్న జిఎస్‌డిపి శాతానికి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయపడింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభు త్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టింది.

అప్రాప్రియేషన్ అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్‌పై కాగ్ నివేదికలను శాసనసభలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీష్‌రావు ప్రవేశపెట్టారు. 2021 –22లో రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రాంట్లకు సంబంధించి రూ.75 వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందన్న కాగ్ ఆర్థిక, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం పంచాయతీరాజ్ శాఖల కేటాయింపులకు మించి 34 శాతం ఖర్చు అయ్యాయని పే ర్కొంది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే త క్కువగా ఖర్చు చేశారని వివరించింది. 2021–22లో రాష్ట్ర ప్రభుత్వం 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 259 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని వినియోగించుకుందని తెలిపింది.2021–22లో రాష్ట్ర ప్రభుత్వం వంద రో జుల పాటు రూ. 22,669 కోట్లు ఓ వర్ డ్రాప్టునకు వెళ్లిందని పేర్కొంది. 2018–19లో రెవెన్యూ మిగులుతో ఉన్న రా ష్ట్రం 2020–21 నాటికి 9,335 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందని కాగ్ స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తున్న రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వరకు ఉద్యోగుల వేతనాలు, వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని వివరించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News