Sunday, December 22, 2024

ప్రజలు తిరస్కరించినా బిఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదు

- Advertisement -
- Advertisement -

మతిభ్రమించి అవాస్తవాలను మాట్లాడుతున్నారు
అహంకారం పనికిరాదు
కెటిఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రజలు తిరస్కరించినా బిఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదని, బిఆర్‌ఎస్ నాయకులకు మతిభ్రమించి అవాస్తవాలను మాట్లాడుతున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కెటిఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్ట కెటిఆర్ అమర్యాదగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో ఆటోలో తిరుగుతూ కెటిఆర్ చీప్ ట్రిక్స్ చేస్తున్నాడని, ఎమ్మెల్యే కెటిఆర్ మానసిక స్థితి సరిగా లేదని ఆయన ఆరోపించారు. అందుకే మానసిక ఆరోగ్యచట్టం సెక్షన్ 12 (2) కింద కెటిఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా తీర్పుతో ప్రజాస్వామ్యబద్దంగా రేవంత్ రెడ్డి సిఎం అయ్యారని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందే సిఎంగా ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించి సత్తా గల నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి, చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News