- Advertisement -
భువనేశ్వర్ : బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్ధిగా తమ పార్టీ బిజేడి పరిగణిస్తున్నా ప్రధాని నరేంద్రమోడీతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని అధికార బీజేడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని కేంద్రప్రభుత్వం కు వ్యతిరేకంగా పట్నాయక్, ఆయన పార్టీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్షంపై ఆరోపణలు చేయడం పరిపాటి.
అయితే రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి చక్కని సహకారం లభిస్తోందని అంగీకరించారు. ఆదివారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒడిశా లిటరరీ ఫెస్టివల్ (ఒఎల్‌ఎఫ్) కార్యక్రమంలో ముఖ్యమంత్రి పట్నాయక్ మాట్లాడారు. ప్రధాని మోడీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానంగా పట్నాయక్ వివరణ ఇచ్చారు.
- Advertisement -