Thursday, January 23, 2025

ప్రతి బిజెపి కార్యకర్త రోజు గంట సమయాన్ని పార్టీకి కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ప్రతి బిజెపి కార్యకర్త రోజుకు ఒక గంట సమయాన్ని పార్టీ కోసం కేటాయించాలని భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశనం చేశారు. మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన మేరా బూత్ సబ్సే మజ్బూత్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి మొ దలుకుని మండల, జిల్లా, రాష్ట్రం, దేశ స్థాయి వరకు కార్యకర్తలందరూ పటిష్టంగా పని చేయాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడమే లక్షంగా పని చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఒకప్పుడు అమెరికా వైట్ హౌజ్ ముందు నిలబడి ఫోటో దిగిన నరేంద్ర మోడీ నేడు అదే వైట్ హౌజ్‌లోకి ముఖ్య అతిధిగా వెళ్లడం మన దేశానికి ఎంతో గర్వ కారణమని తెలిపారు. ప్రతి నాయకుడు, కార్యకర్త మోడీ స్ఫూర్తితో ముందుకు సాగాలని బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఈ సమావేశంలో నాయకులు దూడల భిక్షంగౌడ్, రమనగోని శంకర్, పోలోజు శ్రీధర్‌బాబు, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దాసోజు భిక్షమాచారి, గోవర్ధన్‌రెడ్డి, ఆలె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News