Wednesday, November 13, 2024

ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్‌పి, సిఐలు, ఎస్‌హెచ్‌ఓలతో ఎస్‌పి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొని పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎస్‌పి కరుణాకర్ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసుల పనితీరు ఉండాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న దృష్టా బైండోవర్, ఎక్సైజ్ కేసులు, ఎన్‌బిడబ్లూ అమలు, ఆయుధాల డిపాజిట్‌పై దృష్టి పెట్టాలని అన్నారు. నేర నియంత్రణకు, నేర చేదనకు ఎంతగానో ఉపయోగపడే సిసి కెమెరాల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని ఎస్‌పి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్‌పి రామోజు రమేష్, ఏఆర్ అదనపు ఎస్‌పి వి శ్రీనివాస్, భూపాలపల్లి, కాటారం డిఎస్‌పిలు ఏ రాములు, జి రామ్మోహన్‌రెడ్డి, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News