Friday, November 22, 2024

ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

తానూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బోల్సా గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను, పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించి గ్రామస్తులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్య పడవద్దని మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముథోల్ నియోజకవర్గంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు, ఇండ్లు, పొలాలు, ప్రతి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెల్లి నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని అన్నారు.

గ్రామస్తులందరూ కలిసి మాకు ఇక్కడ ఈ గ్రామం వద్దు మాకు వేరే దగ్గర గ్రామం తరపు నుండి 5 ఎకరాల భూమి ఉంది మాకు అక్కడ ప్లాట్లు చేసి ఇచ్చి అక్కడ నివాసం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా కృషి చేస్తానన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తారని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. ఈయన వెంట నిర్మల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, ఆత్మ చైర్మన్ పోతా రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ నారాయణ రావు పటేల్, ఎంపీపీ చంద్రకాంత్, మండల కోఆప్షన్ సభ్యులు గోవింద్ రావుపటేల్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉత్తం బాలేరావు, మండల సర్పం చ్‌లు,ఎంపిటిసిలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, ఆత్మ డైరెక్టర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News