Monday, December 23, 2024

ప్రతి రైతుకు నూతన పాలకవర్గం అండగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

దౌల్తాబాద్: నియోజకవర్గంలోని ప్రతి రైతుకు అండ గా నూతన పాలకవర్గం ఉండాలని పాలకవర్గ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు సిద్ద్ధంగా ఉంటుందని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఫంక్షన్‌హాల్‌లో మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన కోడంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బాయిరెడ్డి సుజాత మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు కౌసల్య, రామకృష్ణారెడ్డి, భానుప్రకాష్‌లను ఎమ్మెల్యే ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మండలానికి చైర్‌పర్సన్ పదవీని కేటాయించిన ఎమ్మెల్యేకు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం పాలన కొనసాగించాలన్నారు. రైతుల అవసరాలు తీర్చేందుకు ప్రభు త్వం నుండి అవసరమయ్యే నిధులు తదితర సౌకర్యాలను తాము దగ్గరుండి పాలకవర్గానికి సమకూర్చి పెడతామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష రమేష్, ఎంపిపి విజయ్‌కుమార్, వైస్ ఎంపిపి మహిపాల్‌రెడ్డి, జడ్‌పీటీసీ సభ్యుడు కోట్ల మహిపాల్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ప్రమోద్‌రావ్, నర్వోత్తంరెడ్డి, మల్లేషం, భగవంతు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News