Wednesday, January 22, 2025

నగరం నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో రామమందిర దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Every Friday train from Hyderabad to Ayodhya

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News