Wednesday, January 22, 2025

ప్రతి అధికారి అందుబాటులో ఉండాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: నేడు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో సీఎం కేసిఅర్ పర్యటన నేపథ్యంలో ప్రతి ఆధికారి అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో అన్ని శాఖల ఆధికారులతో పర్యటనకు సంబంధించి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో కేటాయించిన అన్ని శాఖల ఆధికారులు 9.45 వరకు కలెక్టర్ కార్యాలయం వరకు రావాలని అదేశించారు. ప్రతి ఆధికారి తమకు కేటాయించిన గదులలో ఉండాలని విధిగా పాస్ కలిగి ఉండాలని సూచించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో అధికారులు ఇచ్చిన సమయానికి అంత ముందుగా ఆయా స్థలాల చేరుకోవాలని సూచించారు. అధికారులకు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, అర్‌డిఓ రాజేశ్వర్, జిల్లాలోని అన్ని శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News