Saturday, March 29, 2025

నేరాల శైలీ మారుతోంది.. మనమూ మారాలి : సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల పరిష్కారం కోసం హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన ‘షీల్డ్ 2025’లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సైబర్ నేరాల్లో కోల్పోయిన సొమ్ముని తిరిగి తీసుకురావడంలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు గత ఏడాది 7 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఇంట్లో ఉండే సొమ్మును దొంగలు దోచుకొనేవారు.. కానీ ఇప్పుడు ఏక్కడి నుంచి దోపిడి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. నేరాల శైలీ మారుతోంది, దానికి అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి’ అని అన్నారు.

ఈ సమావేశంలో 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఇంత విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. 2024లో సైబర్ నేరాల్లో కాజేసిన రూ.350 కోట్లను సీజ్ చేశామని.. అందులో రూ.183 కోట్లు 18 వేల మంది బాధితులకు అందించామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News