Sunday, January 19, 2025

ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన సందర్బంగా ఈ విషయం తెలిపారు. రూ. 22.5 వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు పూర్తిచేస్తామన్నారు.

గడచిన పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కట్టినవి కూడా చేతికి ఇవ్వలేదని అన్నారు. అహంకారం, కల్లబొల్లి మాటలతో కాలాన్ని నెట్టుకొచ్చిందన్నారు. పేదలను బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి.. ప్రయోజనాలు కలిగించలేదన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News