ఐటి దాడుల తర్వాత ట్వీట్ చేసిన సోనూ సూద్
న్యూఢిల్లీ/ముంబయి: గత వారం ముంబయిలోని తన ఇంటిపై, కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించడమే కాకుండా, తాను పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు చేశాక నటుడు సోనూ సూద్ సోమమవారం తన మౌనాన్ని వీడారు. “నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రాణాలు కాపాడేందుకే, ఆపన్నులకు చేరుకోడానికే” అన్నారు. తాను నాలుగు రోజులుగా అతిథులతో బిజీగా ఉన్నానని ఆదాయపు పన్ను శాఖ వ్యాఖ్యానించడాన్ని కూడా ఆయన ఎండగట్టారు.
“మన వాదన ఏమిటో ప్రతీసారి వినిపించాల్సిన పనిలేదు. చెప్పాల్సిందేదో కాలమే చెబుతుంది. మంచి చేయి మంచి జరుగుతుంది. చివరికి మంచివారికి మంచే జరుగుతుంది” అని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతి భారతీయుడికి ఉన్న సదాశయం వల్ల దుర్భర మార్గం కూడా సునాయాసం అవుతుంది’ అని ఆయన అన్న విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక కాస్త లూజ్ గా అనువదించింది.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021