Monday, December 23, 2024

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్షంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

చేగుంట: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు నాయకులు, అన్ని విభాగాల నాయకులు గెలుపే లక్షంగా కృషి చేయాలని కేంద్ర మత్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సోమవారం చేగుంట మండల పరిధిలోని వ డియారం గ్రామ శివారులో ఉన్న ఓ ప్రైవేటు పం క్షన్ హాల్‌లో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ని యోజక వర్గాల ముఖ్య నాయకుల, కార్యకర్తల ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అథితిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కేంద్ర మంత్రికి దు బ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అవినీతిని ప్రజల్లోకి తీసుకెలుతూ కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని దించేందు కు అందరూ కలసి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా ముఖ్య నాయకులు మరళీయాదవ్, చేగుంట మండల బిజెపి అధ్యక్షుడు చింతల భూపాల్, దుబ్బాక నియోజక కో కన్వీనర్ గోవింద్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామచంద్రం, మాజీ ఎంపిపి పాండు, నాయకులు బాలచంద్రం, నాగభూశనం, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News