Monday, December 23, 2024

ప్రతి గిరిజన బిడ్డా కాంగ్రెస్‌కే జై కొట్టాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందకు ప్రతి గిరిజన బిడ్డా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాలని మునుగోడు ఇంచార్జి టిపిసిసి ప్రధానకార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని గుడి తండా, కడీలబావి ండా, తుంబావి తండా గ్రామాలలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి గిరిజనుల సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ మానస పుత్రిక ధరణి పథకం మూలంగా నే రాచకొండ గిరిజనులకు భూసమస్యలు దాపురించాయన్నారు.

పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కెసిఆర్ 9 ఏళ్ల పాలనలో తండాలలో పైసా అభివృద్ది జరుగలేదన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రేస్ హాయాంలో ఇందిరమ్మ, వైఎస్ పాలనలో అటవి భూ పట్టాలు పొందిన గిరిజనులకు ఫారెస్టు అధికారుల వేదింపులు తప్పా ఒరిగిందే మీ లేదన్నారు. 60 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని ధళితులకు, లంబాడీలకు, వెనకబడిన పేద వర్గాల వారికి భూ పంపిణీ చేస్తే కెసిఆర్ ధరణి పేరుతో వాటిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో కెసిఆర్ పేదల భూములను కార్పోరేట్ సంస్థలకు దారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాచకొండ గిరిజన భూసమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలుపడంతో పాటు ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షలు, 500లకే గ్యాస్ సిలిండర్, వరికి 2500 ల మద్దతు ధర, 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ, కుటుంబంలో ఇద్దరి ముసలోల్లకు పింఛన్, కూలీలకు 15000 వేల ఆర్ధిక సహాయం, కౌలు రైతులకు పంట రుణాలు, నిరుద్యోగులకు 4000ల బృతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ లాంటి పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అనంత రం కృష్ణారెడ్డి సరళమైసమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఏపూరి సతీష్, మందుగుల బాలకృష్ణ, మాజీ ఎంపిపి బుజ్జి, రాసమల్ల యాదయ్య, లోక్యా నాయక్, మారయ్య, చాపల నర్సింహ్మ, బిట్టు సత్యం, గూడూరు వెంకట్‌రెడ్డి, జరుపుల జగన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News